ధోనిలా స్టంపింగ్ చేసి… అబ్బురపరిచిన ఇంగ్లీష్ క్రికెటర్

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల వెనుక ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ క్రీజు దాటితే చాలు.. రెప్పపాటులో స్టంపింగ్ చేసేస్తాడు. ఒక్క స్టంపింగ్ మాత్రమే కాదు.. రనౌట్ల సమయంలో కూడా వికెట్లు చూడకుండానే బెయిల్స్‌ను ఎగరగొడతాడు ధోని.  క్రికెట్ అభిమానులనే కాదు.. దిగ్గజాలను సైతం తనదైన శైలితో ధోని ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచాడు. దిగ్గజ వికెట్ కీపర్లు ఎంతోమంది ఉన్నా.. ధోని స్టైల్ మాత్రం సెపరేట్ అని చెప్పవచ్చు. […]

ధోనిలా స్టంపింగ్ చేసి... అబ్బురపరిచిన ఇంగ్లీష్ క్రికెటర్
Follow us

|

Updated on: Jul 26, 2019 | 4:48 PM

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల వెనుక ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ క్రీజు దాటితే చాలు.. రెప్పపాటులో స్టంపింగ్ చేసేస్తాడు. ఒక్క స్టంపింగ్ మాత్రమే కాదు.. రనౌట్ల సమయంలో కూడా వికెట్లు చూడకుండానే బెయిల్స్‌ను ఎగరగొడతాడు ధోని.  క్రికెట్ అభిమానులనే కాదు.. దిగ్గజాలను సైతం తనదైన శైలితో ధోని ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచాడు. దిగ్గజ వికెట్ కీపర్లు ఎంతోమంది ఉన్నా.. ధోని స్టైల్ మాత్రం సెపరేట్ అని చెప్పవచ్చు. అలాంటిది తాజాగా జరిగిన ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో హాంప్‌షైర్ వికెట్ కీపర్ అచ్చం ధోని మాదిరిగానే స్టంపింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌తో పాటు మిగతా ప్లేయర్స్‌ను సైతం ఆశ్చర్యపరిచాడు.

గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో హాంప్‌షైర్, సస్సెక్స్ జట్లు తలబడ్డాయి. ఇందులో భాగంగా స్పిన్నర్ మాసాన్ క్రేన్ వేసిన ఓవర్‌లో సస్సెక్స్ బ్యాట్స్‌మెన్ ఇవాన్స్ సిక్స్ కొట్టే క్రమంలో ముందుకు వచ్చాడు. అయితే అతడికి బాల్ కనిపించకపోగా.. క్రీజు దాటాడు. దానితో వికెట్ కీపర్ మెక్‌మనుస్.. ధోని స్టైల్‌లో స్టంపింగ్ చేసి అందరిని అబ్బురపరిచాడు.  మీరు కూడా ఈ స్టంపింగ్‌పై ఓ లుక్కేయండి.