ఇండియాకు పాక్ బంపర్ ఆఫర్..! ఎందుకు..?

ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు తమ రోజా విరమించిన అనంతరం ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రూహ్ అఫ్జా అనే పానీయం ఉండాల్సిందే. ఈ సమయంలో శీతల పానీయమైన దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పానీయానికి విపరీతమైన కొరత ఏర్పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. రూహ్ అఫ్జా తయారీకి ఉపయోగించే ముడిసరుకు లభ్యం కాకపోవడం వల్లే సరఫరాలో కొరత ఏర్పడిందని ఈ పానీయాన్ని తయారు చేసే హామ్ […]

ఇండియాకు పాక్ బంపర్ ఆఫర్..! ఎందుకు..?
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 1:09 PM

ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు తమ రోజా విరమించిన అనంతరం ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రూహ్ అఫ్జా అనే పానీయం ఉండాల్సిందే. ఈ సమయంలో శీతల పానీయమైన దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పానీయానికి విపరీతమైన కొరత ఏర్పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

రూహ్ అఫ్జా తయారీకి ఉపయోగించే ముడిసరుకు లభ్యం కాకపోవడం వల్లే సరఫరాలో కొరత ఏర్పడిందని ఈ పానీయాన్ని తయారు చేసే హామ్ దర్ద్ ల్యాబ్స్ చెబుతోంది. అయితే.. తయారీ సంస్థ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే ఉత్పత్తి ఆపేసినట్టు సమాచారం.

కాగా.. ఇండియాలో రూహ్ అఫ్జా కొరతను భర్తీ చేసేందుకు పాకిస్తాన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎంత కొరత ఉందో అంత సరఫరా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రకటించింది. భారత దేశ ప్రభుత్వం ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే పంపుతామని అధికారులు స్పష్టం చేశారు. రంజాన్ టైంలో పాక్ ప్రభుత్వం తనంత తానుగా ఇలా చొరవ చూపడం అనుమానించ దగ్గ విషయమేనని ఊహాగాహానాలు వెల్లువెత్తుతున్నాయి.