ముగిసిన గ్రేటర్ నామినేషన్ల పర్వం… మూడు రోజుల్లో 1,889 నామినేషన్లు దాఖలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలయ్యాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు...

ముగిసిన గ్రేటర్ నామినేషన్ల పర్వం... మూడు రోజుల్లో 1,889 నామినేషన్లు దాఖలు
Follow us

|

Updated on: Nov 20, 2020 | 9:17 PM

Greater Hyderabad Nominations : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలయ్యాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన 1,421 మంది అభ్యర్థులు 1,889 నామినేషన్లు దాఖలు చేశారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల దాఖలు సమయం ముగియగా.. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారికి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశంను అధికారులు కల్పించారు. మొత్తంగా చివరి రోజు గ్రేటర్‌ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి… మొత్తం 1,889 నామినేషన్లు దాఖలు కాగా.. ఇవాళ ఒకేరోజు 1,223 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 150 వార్డుల నుంచి 1,421 మంది అభ్యర్థులు.  1,889 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఇవాళ చివరి రోజు కావడంతో ఒక్కరోజే 1,223 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ నుంచి 400పైగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్లలో టీఆర్ఎస్ 424 ,బీజేపీ428, కాంగ్రెస్‌ 275, ఎంఐఎం 58, టీడీపీ155, సీపీఐ 12, సీపీఎం 17 నామినేషన్లు దాఖలు చేశాయి. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 66, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 454 నామినేషన్లు వేశారు. ఇక మొత్తం దాఖలైన 1,889 నామినేషన్లలో భారతీయ జనతా పార్టీ నుంచి అత్యధికంగా 400  శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు.