దేశంలో 30 కోట్లమందికి ‘ఉచిత’వ్యాక్సిన్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడి, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని క్లారిటీ

దేశ వ్యాప్తంగా ప్రయారిటీ గ్రూప్ లోని  30 కోట్ల మంది వ్యాక్సినేషన్ కి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు,

దేశంలో 30 కోట్లమందికి 'ఉచిత'వ్యాక్సిన్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడి, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2021 | 11:55 AM

దేశ వ్యాప్తంగా ప్రయారిటీ గ్రూప్ లోని  30 కోట్ల మంది వ్యాక్సినేషన్ కి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ తెలిపారు. కానీ మొత్తం జనాభాకు మాత్రం కాదన్నారు. రానున్న ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృధ్ధులు ఇలా వివిధ వర్గాలను తొలి దశలో ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వల్ల మరణాలను తగ్గించాలన్నది లక్ష్యమని, హయ్యర్రిస్క్ గ్రూపులను సెలెక్ట్ చేస్తామని ఆయన వివరించారు. ఇండియాలో 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. పైగా ఇతర గ్రూపులను కూడా చేర్చాల్సి ఉంది అని పాల్ పేర్కొన్నారు. 29 వేల వ్యాక్సిన్ పాయింట్లను సప్లయ్ చేసేందుకు 31 కరోనా వైరస్ హబ్ లను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

300 మిలియన్ల మందిలో మొదట 30 కోట్లమందిని  సెలెక్ట్ చేశామని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అటు ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగాన్ని  భారత డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదించింది. దేశవ్యాప్తంగా డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే వేలమంది డాక్టర్లను, హెల్ప్ లైన్ వర్కర్లను ఎంపిక చేశారు.

Latest Articles