Sankranti: రాజ్‌భవన్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా ప్రత్యేక వంటకం చేసి..

Sankranti: హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కుటుంబ సమేతంగా పండుగను..

Sankranti: రాజ్‌భవన్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా ప్రత్యేక వంటకం చేసి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 8:55 PM

Sankranti: హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కుటుంబ సమేతంగా పండుగను ఘనంగా జరుపుకున్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ పద్దతిలో దుస్తులు ధరించారు. దేవుడికి పూజలు చేసిన గరవ్నర్ తమిళిసై.. ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని ఆమె ప్రార్థనలు చేశారు. కాగా, సంక్రాంతి పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై స్వయంగా ప్రత్యేక వంటకాన్ని వండారు. ఆ వంటకాన్ని ముందుగా సూర్య భగవానుడికి సమర్పించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులందరికీ వడ్డించారు. రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని గవర్నర్ అధికారిక నివాసమైన మెయిన్ హౌస్ ముందు ఈ సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ భర్త, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్, ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

కాగా, సంక్రాంతి వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి గాలి పటాలను ఎగురవేశారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆత్మ నిర్భర్ భారత్‌పై సందేశాలతో గవర్నర్ గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ గాలిపటాలు.. ”మా వ్యాక్సిన్-మా గౌరవం, మా దేశం-మా వ్యాక్సిన్, మా టీకాలు-సురక్షితమైన టీకాలు, అత్మ నిర్భర్ భారత్” వంటి సందేశాలను తీసుకువెళతాయని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా గాలిపటాలపై సందేశాలు ఉన్నాయన్నారు.

Also read:

16న 81 సెంటర్లలో వ్యాక్సినేషన్, అనంతరం మరిన్నికేంద్రాలు పెంచుతాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , 4 రోజుల కార్యక్రమం !

TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..