Gold Rate Today(01-02-2021): మళ్ళీ పరుగులు పెడుతున్న పసిడి.. 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా..!

కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఆల్ టైం హైకి వెళ్లిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా దిగివస్తున్నాయని అనుకునే సమయంలో.. మళ్ళీ బంగారం ధర పరుగులు..

Gold Rate Today(01-02-2021): మళ్ళీ పరుగులు పెడుతున్న పసిడి.. 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 01, 2021 | 7:17 AM

Gold Rate Today(01-02-2021) కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఆల్ టైం హైకి వెళ్లిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా దిగివస్తున్నాయని అనుకునే సమయంలో.. మళ్ళీ బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి మళ్లీ క్రమంగా పైకి కదులుతోంది. బంగారం ధర ఈరోజు పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారికి ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన సమయం అని చెప్పవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 24 క్యారెట్ల బంగారం గ్రా. 10 ధర రూ.160 పైగా పెరిగింది. దీంతో మళ్ళీ 10గ్రాముల బంగారం ధర రూ. 49,960కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.160 పెరిగి.. రూ. 45,810కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర జిగేల్ మంటుంది. బంగారం ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరుగుదలతో 1858 డాలర్లకు చేరుకుంది. బంగారం ధర పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్ లో వినియోగదారులు బంగారం కొనుగోలును తగ్గించినట్లు.. ముదుపరులు బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా

Also Read: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు.. నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..