ఒక్క రోజు పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌గా బాలిక.. కాన్పూర్‌ పోలీసుల అభినందన చర్య

బాలిక దినోత్సవం సందర్భంగా ఆ మధ్యన ఇంటర్‌ చదువుతున్న ఓ బాలిక అనంతపురంలో ఒక్కరోజు కలెక్టర్‌గా విధులు నిర్వరించిన విషయం తెలిసిందే

  • Manju Sandulo
  • Publish Date - 1:17 pm, Sat, 21 November 20

Girl in-charge of police station: బాలిక దినోత్సవం సందర్భంగా ఆ మధ్యన ఇంటర్‌ చదువుతున్న ఓ బాలిక అనంతపురంలో ఒక్కరోజు కలెక్టర్‌గా విధులు నిర్వరించిన విషయం తెలిసిందే. బాలికలను మరింత ప్రోత్సహించేలా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రభుత్వ అనుమతితో ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రుడిపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు అదే బాటలో కాన్పూరు పోలీసులు నడిచారు. (‘అంజలి’ పాటలో అర్హ.. అదరగొట్టిన అల్లు అర్జున్‌ గారాలపట్టి.. బన్నీ స్పెషల్ అప్పియరెన్స్‌)

ప్రపంచ బాలబాలికల దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం ఒక బాలికకు ఒక్కరోజు స్టేషన్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఒక మహిళకు తన హక్కులు, న్యాయబద్దమైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆ బాలికకు ఒక్కరోజు విధులు అప్పగించామని ఓ పోలీస్‌ అధికారి ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు ఆ బాలిక మాట్లాడుతూ.. ఒక్కరోజు ఇంఛార్జ్‌గా పనిచేసేందుకు పోలీస్‌ స్టేషన్‌ల పని గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు చాలా తృప్తిగా అనిపించింది అని తెలిపారు. (ఇంట్రస్టింగ్‌గా ‘అంటే సుందరానికీ’ కర్టన్‌ రైజర్‌.. త్వరలో ఆట మొదలు అంటోన్న నాని)