జర్మనీలో కొత్తగా మరో 305 పాజిటివ్ కేసులు

జర్మనీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య..

జర్మనీలో కొత్తగా మరో 305 పాజిటివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 3:29 AM

జర్మనీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,05,269కి చేరింది. వీటిలో 1.90 లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆదివారం నాడు తెలిపింది. ఇక జర్మనీలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 9,118 మంది మరణించారు. కాగా, అంతకు ముందు రోజు జర్మనీలో కొత్తగా 781 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తగ్గుముఖం పడుతుందనుకున్న వేళ.. తిరిగి కేసులు మళ్లీ పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులస సంఖ్య 16 మిలియన్లకు చేరింది. ఇప్పటి వరకు కూడా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ రాకపోవడంతో.. దీనికి బ్రేకులు పడటం లేదు. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపిన ప్రకారం.. ప్రస్తుతం 15.9 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇక కరోనా బారినపడి 6.43 లక్షల మంది మరణించారు.