హీరో హవీష్‌ నూతన చిత్రం ప్రారంభం

యువ హీరో హవీష్ ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన  కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రియేటీవ్ డైరెక్టర్‌ సుకుమార్‌, ఏసియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. హవీష్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సుకుమార్‌ క్లాప్‌ ఇవ్వగా.. సదానంద్‌ కెమెగా స్వీచ్‌ ఆన్‌ చేశారు. దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌కు సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్ […]

హీరో హవీష్‌ నూతన చిత్రం ప్రారంభం
Follow us

|

Updated on: May 29, 2019 | 12:42 PM

యువ హీరో హవీష్ ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన  కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కొత్త సినిమా ప్రారంభమైంది. రొమాటింక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రియేటీవ్ డైరెక్టర్‌ సుకుమార్‌, ఏసియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. హవీష్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సుకుమార్‌ క్లాప్‌ ఇవ్వగా.. సదానంద్‌ కెమెగా స్వీచ్‌ ఆన్‌ చేశారు.

దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌కు సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్ అందచేశారు. త్వరలో పూర్తి నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిస్తుండగా సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.