Breaking: పశ్చిమ గోదావరిలో గ్యాస్ లీక్ కలకలం..

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా గ్యాస్ లీక్ ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో గ్యాస్ లీకేజ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడం జరిగింది. దీనితో వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులను అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ […]

Breaking: పశ్చిమ గోదావరిలో గ్యాస్ లీక్ కలకలం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 1:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా గ్యాస్ లీక్ ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో గ్యాస్ లీకేజ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడం జరిగింది. దీనితో వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులను అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ చుట్టపక్కల ఉన్న 5 గ్రామాలకు దయనీయ పరిస్థితి ఏర్పడిన సంగతి విదితమే.