ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం సెలవు

Ganesh immersion holiday declared tomorrow twin cities, ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం సెలవు

గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు( గురువారం) హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈనెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,కాలేజీలు యధావిధిగా పనిచేస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం భారీ ఎత్తున నిర్వహిస్తున్నందున ఈ జిల్లాల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *