ముంబై వీధుల్లో ‘హాలీవుడ్ మ్యూజిక్ ‘.. డ్రమ్స్ తో ఇరగదీసిన డైరెక్టర్

Ganesh chaturthi Anand Mahindra posts video of hollywood music, ముంబై వీధుల్లో ‘హాలీవుడ్ మ్యూజిక్ ‘.. డ్రమ్స్ తో ఇరగదీసిన డైరెక్టర్

గణేష్ చతుర్థి సందర్భంగా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ముంబై వీధుల్లో డ్రమ్స్ కొట్టి అందరిలో జోష్ నింపారు. ఆయనతో బాటు ఆయన సహచరులు, స్థానికులు కూడా ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అంతా డ్రమ్స్ కొడుతూ వావ్ అనిపించారు. ఈ వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ముంబై వీధుల్లో ఈ హాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ డ్రమ్స్ వాయించిన తీరు చూడండి.. ఇదే జోష్ మనకూ కావాలి.. గణేష్ ఇమ్మర్షన్ సందర్భంగా ప్రతి ఏడాదీ మన సాంస్కృతిక బృందాలు కూడా ఓ అంతర్జాతీయ ‘ స్ట్రీట్ డ్రమ్స్ ఫెస్టివల్ ‘ ను నిర్వహిస్తే ఎలా ఉంటుందంటారు ? అని ఆయన సరదాగా ఓ కామెంట్ పెట్టారు. ఈ వీడియో చూసి.. ఆయన కామెంట్లు చదివిన నెటిజన్లు.. తమదైన స్టయిల్లో రకరకాలుగా స్పందించారు. ఓ నెటిజనుడు.. ఈ నగరంలో అమ్మాయిలు కూడా ఎలా డ్రమ్స్ వాయిస్తున్నారో చూడండంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మరొకరైతే.. ఆయా సమస్యలపైనే కాకుండా ఆనంద్ మహీంద్రా ఇలాంటి వినోదాత్మక సంఘటనలపైనా ఎంత చురుగ్గా స్పందిస్తున్నారో అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *