పారిశుద్ధ్య కార్మికులపై వివక్షత.. క్రిమినల్ కేసులు నమోదు

శ్రీకాకుళంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మెలియాపుట్టి గ్రామంలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందగా.. టెక్కలి, నౌపాడలకు చెందిన తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులు అతడికి దహన సంస్కరణలు చేశారు.

పారిశుద్ధ్య కార్మికులపై వివక్షత.. క్రిమినల్ కేసులు నమోదు
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 1:20 PM

శ్రీకాకుళంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మెలియాపుట్టి గ్రామంలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందగా.. టెక్కలి, నౌపాడలకు చెందిన తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులు అతడికి దహన సంస్కరణలు చేశారు. కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం పీపీఈ కిట్లు ధరించి తొమ్మిది మంది అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కరోనా లక్షణాలున్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడంతో టెక్కలికి చెందిన కొందరు, ఆ పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్షతను చూపించారు.

పరీక్షలు చేయించుకొని రావాలని వారిని అడ్డుకున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అంబేద్కర్‌ ఆడిటోరియం దగ్గర ఉండాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వారికి రెండు రోజులువుతున్నా ఆహారం లభించలేదు. రోడ్డుపై వెళ్లేవారు నీళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దీంతో ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివక్షత చూపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విపత్కర పరిస్థితుల్లో అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్షత చూపడం బాధాకరమని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.