ఆ ఐదుగురు భారతీయులను అప్పగిస్తున్న చైనా

అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నెల 1 న తమకు తెలియకుండా చైనా భూభాగంలోకి ప్రవేశించి గల్లంతయిన  ఐదుగురు భారతీయులను చైనా సైన్యం..పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ..ఇండియాకు అప్పగించనుంది. వీరిని శనివారం ఓ నిర్దేశిత ప్రదేశంలో..

ఆ ఐదుగురు భారతీయులను అప్పగిస్తున్న చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2020 | 10:41 AM

అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నెల 1 న తమకు తెలియకుండా చైనా భూభాగంలోకి ప్రవేశించి గల్లంతయిన  ఐదుగురు భారతీయులను చైనా సైన్యం..పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ..ఇండియాకు అప్పగించనుంది. వీరిని శనివారం ఓ నిర్దేశిత ప్రదేశంలో చైనావారు అప్పగించనున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. వీరు వేటగాళ్ళని భారత సైన్యం అంటుండగా. వీరి కుటుంబాలు మాత్రం తమవాళ్లు భారత జవాన్లకు నిత్యావసరాలను తీసుకువెళ్లే పోర్టర్లని చెబుతున్నాయి. లడాఖ్ లోని అప్పర్ సుభాన్ సిరి ప్రాంతంలో ఈ ఐదుగురూ దారి తప్పి..అవతల చైనా భూభాగంలోకి ఎంటరయ్యారు. వీళ్ళు తమ అధీనంలో ఉన్నారని చైనా సైన్యం ఈ నెల 8 న ప్రకటించింది.