బాత్రూంలో దూరిన ఐదడుగుల కొండచిలువ

ఆడవుల్లో ఉండాల్సిన జీవచరాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఓ కొండచిలువ బాత్రూంలోకి దూరింది. దీంతో ఆ ఇంటి యాజమాని పెద్ద కొండచిలువ చూసి గుండెలు గుబెలుమన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అటవీ ప్రాంతానికి చెందిన వన్యప్రాణులు నీటి ప్రవాహాన్ని కొట్టుకొస్తున్నాయి.

బాత్రూంలో దూరిన ఐదడుగుల కొండచిలువ
Follow us

|

Updated on: Jul 23, 2020 | 3:53 PM

ఆడవుల్లో ఉండాల్సిన జీవచరాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఓ కొండచిలువ బాత్రూంలోకి దూరింది. దీంతో ఆ ఇంటి యాజమాని పెద్ద కొండచిలువ చూసి గుండెలు గుబెలుమన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అటవీ ప్రాంతానికి చెందిన వన్యప్రాణులు నీటి ప్రవాహాన్ని కొట్టుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీలోని ప్రాంతంలోని ఇంటిలోని బాత్ రూంలోకి ఐదు అడుగుల పొడవు ఉన్న కొండచిలువ వచ్చింది. కొండచిలువను చూసిన కుటుంబసభ్యులు వన్యప్రాణుల విభాగం, స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లకు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌కు సమాచారమిచ్చారు. దీంతో వాలంటీర్లు వచ్చి బాత్ రూంలోని కొండచిలువను పట్టుకొని వన్యప్రాణుల విభాగానికి తరలించారు. మరో ఘటనలో ప్రాచీన కళా భైరవ మందిరంలో పూజలు చేసేందుకు వచ్చిన పూజారికి పాము కనిపించింది. దీంతో స్నేక్ క్యాచర్స్ ఆలయంలోని ఆ పామును పట్టుకొని అడవిలో వదిలేశారు. వర్షాకాలం కావడంతో పాములు బయటకు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి విభాగం అధికారి వసీం అక్రం సూచించారు.