అది ఫేక్ న్యూస్, పన్ను చెల్లింపు వార్తపై ట్రంప్ ఖండన

2016 లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక కేవలం 750 డాలర్ల పన్నును చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ లో వఛ్చిన వార్తను ట్రంప్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు.

అది ఫేక్ న్యూస్, పన్ను చెల్లింపు వార్తపై ట్రంప్ ఖండన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 28, 2020 | 12:23 PM

2016 లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక కేవలం 750 డాలర్ల పన్నును చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ లో వఛ్చిన వార్తను ట్రంప్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు. వైట్ హౌస్ లో మొదటి సంవత్సరం కూడా ట్రంప్ ఇంతే మొత్తాన్ని చెల్లించారన్న ఆరోపణ కూడా అవాస్తవమన్నారు. తాను సంపాదించిన సొమ్ము కన్నా ట్రంప్ చాలా కోల్పోయారని, అందువల్ల గత 10 సంవత్సరాల్లో ఆయన అసలు ఎలాంటి పన్నునూ చెలించలేదని ఈ వార్తలు పేర్కొన్నాయి. కానీ యధాప్రకారం ఇది కూడా తప్పుడు వార్తే అని ఆయన నొక్కి వక్కాణించారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయపు పన్ను వివరాలను ప్రకటించనక్కరలేదు. కానీ లోగడ ఒక్క రిచర్డ్ నిక్సన్ ఒక్కరే ఇలా తన ఆదాయపు పన్ను రిటర్నుల గురించి ప్రకటించారు. ట్రంప్ తరఫు లాయర్ మాత్రం తమ క్లయింటు లక్షలాది డాలర్లను పన్నుగా చెల్లించారని, కావాలంటే రికార్డులు చూపిస్తామని అంటున్నారు.