జోరుగా నకిలీ విత్తనాల దందా..!

నకిలీ పత్తి విత్తనాల దందా వికారాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమార్కుల దందా మాత్రం ఆగడం లేదు. వ్యాపారులు యథేచ్చగా నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దుద్యాల గేట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా డీసీఎంలో తరలిస్తున్న.. రూ.71.85 లక్షల విలువైన 44.28 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. కర్ణాటక రాష్ట్రం కొప్పళ్ జిల్లా ముధోల్ జిన్నింగ్ మిల్లు నుంచి […]

జోరుగా నకిలీ విత్తనాల దందా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 4:33 PM

నకిలీ పత్తి విత్తనాల దందా వికారాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమార్కుల దందా మాత్రం ఆగడం లేదు. వ్యాపారులు యథేచ్చగా నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దుద్యాల గేట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా డీసీఎంలో తరలిస్తున్న.. రూ.71.85 లక్షల విలువైన 44.28 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. కర్ణాటక రాష్ట్రం కొప్పళ్ జిల్లా ముధోల్ జిన్నింగ్ మిల్లు నుంచి ఈ విత్తనాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్పీ నారాయణ, జిల్లా వ్యవసాయాధికారి గో పాల్ వీటిని పరిశీలించారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన రసూల్ నాయుడు, ఒంగోలుకు చెందిన సురేశ్‌లు ఈ దందాలో ప్రధాన సూత్రధారులని తేలింది. వీరితోపాటు డీసీఎం డ్రైవర్ రాములు, కృష్ణయ్య, వెంకటేశ్, కాశీరాజు, నరేశ్ అనే మరో ఐదుగురిపై పోలీసులు తెలంగాణ విత్తన చట్టం, మోసం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.