ఏపీఎస్ఆర్టీసీలో “ఫేక్ దందా”…విచారణలో బయట పడుతున్న నిజాలు

ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట మరో మోసం వెలుగు చూసింది. ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో రెగ్యులర్ టైమ్‌స్కేల్ బేస్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి తెరలేపారు....

ఏపీఎస్ఆర్టీసీలో ఫేక్ దందా...విచారణలో బయట పడుతున్న నిజాలు
Follow us

|

Updated on: Jun 15, 2020 | 11:23 AM

fake aprtc jobs in vijayawada : ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట మరో మోసం వెలుగు చూసింది. ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో రెగ్యులర్ టైమ్‌స్కేల్ బేస్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి తెరలేపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఓ యూనియన్ నేత అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఫేక్ ఆర్డర్‌లు, ఫేక్ ఐడీలు కూడా సిద్ధం చేసి  మొసానికి తెరలేపారు. అనుమానం వచ్చిన బాధితులు.. నిలదీయడంతో ఈ ఫేక్ దందా వెలుగులోకి వచ్చింది.

వెలుగులోకి వీడియోలు..

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులు వెలుగులోకి రావటంతో, అధికారులు అప్రమత్తమై ఈ ఫేక్ దందాపై విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు‌ ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించారు. ఈ దందా ఏడాది క్రితమే జరిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగాల పేరుతో తయారు చేసిన ఫేక్‌ ఆర్డర్‌‌ను గత ఏడాది ఫిబ్రవరిలో ముద్రించినట్లుగా తెలుస్తోంది.

ఏడాది క్రితమే…

ఏడాది కాలంగా అత్యంత రహస్యంగా ఉన్న ఈ వ్యవహారాన్ని బాధితులు కొందరు వాట్సాప్‌ ద్వారా బయట పెట్టడంతో ఫేక్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ ఫేక్‌ ఆర్డర్‌ కంటే ముందుగానే డబ్బులు వసూలు చేసి.. అభ్యర్థులకు ఫేక్ ఐడీ కార్డులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

సూత్రదారి ఓ యూనియన్ లీడర్..

సోషల్ మీడియా  ద్వారా బయటకు వచ్చిన వీడియోను పరిశీలించిన అధికారలు ఇతను ఓ యూనియన్‌కు చెందిన లీడర్ గా గుర్తించారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమందిని ఓ యూనియన్ నేత మభ్య పెట్టాడు. ఆయన మాటలను విశ్వసించిన 34 మంది..  లక్షల రూపాయలు ముట్టజెప్పుకున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తం దాదాపు రూ.కోటికి పైగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..