ఈ నెల 30 న ఫడ్నవీస్ ప్రభుత్వ పతనం.. శరద్ పవార్..

ఈ నెల 30న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. అజిత్ పవార్ వెంట కేవలం 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని ఆయన అన్నారు. శనివారం శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తమను అజిత్ ఛీట్ చేశాడని ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారని తెలిపారు. ఎన్సీపీ నుంచి అజిత్ పవర్ ను బహిష్కరించాలా అన్న […]

ఈ నెల 30 న ఫడ్నవీస్ ప్రభుత్వ పతనం.. శరద్ పవార్..
Follow us

|

Updated on: Nov 23, 2019 | 1:37 PM

ఈ నెల 30న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. అజిత్ పవార్ వెంట కేవలం 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని ఆయన అన్నారు. శనివారం శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తమను అజిత్ ఛీట్ చేశాడని ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పారని తెలిపారు. ఎన్సీపీ నుంచి అజిత్ పవర్ ను బహిష్కరించాలా అన్న విషయమై సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అజిత్ తమను తప్పుదారి పట్టించాడని ఎమ్మెల్యేలు చెప్పారని పవార్ వెల్లడించారు. అజిత్ వెంట వెళ్లినట్టు చెబుతున్న ముగ్గురు శాసన సభ్యులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. 170 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామని పవార్ ధీమా వ్యక్తం చేశారు. అటు-ఉధ్ధవ్ థాక్రే.. ఇదంతా బీజేపీ ఆడిన నాటకమన్నారు. ‘ ఇది ఆ పార్టీ సర్జికల్ స్ట్రైక్ ‘ అని కూడా అభివర్ణించారు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన సైతం పేర్కొన్నారు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..