Thalapathy 66 : వంశీ పైడిపల్లి సినిమాలో దళపతి విజయ్ ఇలా కనిపించనున్నాడట..

|

May 13, 2022 | 5:13 PM

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.

Thalapathy 66 : వంశీ పైడిపల్లి సినిమాలో దళపతి విజయ్ ఇలా కనిపించనున్నాడట..
Thalapathy Vijay
Follow us on

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. ఆశించిన స్థాయిలో బీస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బీస్ట్ సినిమా బిస్కెట్ అవడంతో ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్. దళపతి తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‪గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు (Dil Raju), శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో భారీ తారాగణం కనువిందు చేయనుంది. సీనియర్‌ నటీనటులు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధతో పాటు కిక్‌ శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ సినిమాలో విజయ్ ఎలా కనిపించనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్ హీరోయిజాన్ని వంశీ పైడిపల్లి డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ సరికొత్తగా కనిపించనున్నారట. లవ్ .. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో బలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ మూవీ తమిళ నాడు నేపథ్యంలో ఉండనుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్