AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cult Movie: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్’ సినిమా షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?

సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న విశ్వక్ సేన్ 'కల్ట్' అంటూ డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

Cult Movie: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ 'కల్ట్' సినిమా షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
Vishwak Sen Cult Movie
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 3:03 PM

Share

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా రూపొందుతున్న కల్ట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఆ మధ్యే విడుదలైన CULT టీజర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. KGF లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక సన్నివేశాలు భారతీయ చలన చిత్రాలకు ధీటుగా రూపొందించబడ్డాయి. ఇప్పుడున్న GenZ యూత్ లో ప్రత్యేక మైన కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సెన్సేషన్ తరుణ్ భాస్కర్ అందించిన మాటలు మరో హైలైట్. తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీగా టెక్నాలజీ తో నిర్మిస్తున్న ఈ కల్ట్ సినిమాలో సినీ దిగ్గజాలదరూ పాలు పంచుకుంటున్నారు. ANIMAL లాంటి సినిమా లకు సౌండ్ డిజైన్ చేసిన సచిన్ అందిస్తున్న సౌండ్ డిజైన్ ఒక ప్రత్యేక స్థాయిలో నిలబెట్టింది. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలలో రూపొందుతున్న కల్ట్ సినిమాలో విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ, లాంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 30 కి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ కల్ట్ సినిమా ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియెన్స్ అందించబోతోంది.

కాగా ఈ సినిమాతో లెగసీ అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కే కే మేనన్, మురళీ మోహన్ , కె కె మీనన్ , రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా భాగం పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే లెగసీ సినిమాను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

కల్ట్ సినిమా టీజర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us