
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరైన విజయ్ సేతుపతి నటించిన హిట్ చిత్రం ‘మహారాజా’ ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే చైనాలోనూ రిలీజై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన సుధన్ సుందరం అధికారికంగా ధృవీకరించారు. కాగా భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా ‘మహారాజ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఇక్కడ థియేటర్లలో 91 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా, ఓటీటీలో కూడా ప్రశంసలు అందుకుంది. ఈ అపూర్వమైన విజయాన్ని చూసి, ఒక ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ఒక అగ్రశ్రేణి నటుడు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ప్రముఖ నటుడు మాథ్యూ మెక్కోనాహే ప్రధాన పాత్రలో కనిపించనున్నారని వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై నిర్మాత సుధన్ స్పందిస్తూ.. ‘వారు చాలా మంది నటులతో చర్చలు జరుపుతున్నారు. ఆ జాబితాలో మాథ్యూ కూడా ఉండవచ్చు. నటీనటులు స్టూడియో వివరాలను ఏజెన్సీ అధికారికంగా ప్రకటిస్తుంది’ అని పేర్కొన్నారు.
నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే సచనా నమీదాస్, కళ్యాణి షినికా, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణియం, అభిరామి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024, జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని మలుపులకు విశేష ప్రశంసలు లభించాయి. విజయ్ సేతుపతి కుమార్తె పాత్ర పోషించిన సంచన నమిదాస్, ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఒక తమిళ సినిమా కథను హాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండటం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ హాలీవుడ్ వెర్షన్‌లో ఎవరు నటిస్తారనే దానిపై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. మొత్తానికి ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ‘మహారాజా’ చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
VijaySethupathi’s #Maharaja – to be Remade in Hollywood..😲#MatthewMcConaughey is likely to reprise the role of VJS..💥
Producer Sudhan about this Remake: McConaughey is one of the stars they are talking to, but only the agency will be able to confirm.. We were approached by a… pic.twitter.com/K6BHgHOYfq
— Laxmi Kanth (@iammoviebuff007) September 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.