Vijay Deverakonda: ఈ ఏడాది విజయ్‌ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. రణబాలి, రౌడీ జనార్దన రిలీజ్ డేట్స్ ఇవిగో

ఈ మధ్యన విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ సినిమాలు బాగానే ఆడాయి. అయితే ఇవేవీ విజయ్ రేంజ్ కు తగిన సినిమాలు కావన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. దీంతో తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాలను అందించేందుకు రెడీ అయ్యాడీ రౌడీ హీరో

Vijay Deverakonda: ఈ ఏడాది విజయ్‌ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. రణబాలి, రౌడీ జనార్దన రిలీజ్ డేట్స్ ఇవిగో
Vijay Deverakonda

Updated on: Feb 08, 2026 | 10:33 AM

హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న “రణబాలి”, “రౌడీ జనార్థన” సినిమాలు ఇప్పటికే మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. వీడీ ఫ్యాన్స్ కు కూడా 2026 ఒక మెమొరబుల్ ఇయర్ కాబోతోంది. “రణబాలి”, “రౌడీ జనార్థన” సినిమాలు రెండూ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో “రణబాలి” సినిమాను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్యాషనేట్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ పై ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న తాను రూపొందిస్తున్న “రౌడీ జనార్థన” సినిమాకు బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ యంగ్ డైరెక్టర్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. “రౌడీ జనార్థన” టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కుతున్న “రణబాలి”, “రౌడీ జనార్థన” చిత్రాల్లో విజయ్ దేవరకొండ అంతే వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 11న “రణబాలి”, డిసెంబర్ లో “రౌడీ జనార్థన” సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.

కాగా ఇటీవలే వచ్చిన రణబాలి సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇందులోని సన్నివేశాలు విజయ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రణబాలి సినిమా డైరెక్టర్‌ రాహుల్ సాంకృత్యాన్ మంచి ట్యాలెంటెడ్. గతంలో అతను విజయ్ దేవరకొండ తో తీసిన ‘టాక్సీవాలా’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ అనే మరో హిట్ ను తెరకెక్కించాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో విజయ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండడం మరో విశేషం.

రణబాలి సినిమా టీజర్..

ఇవి కూడా చదవండి

రౌడీ జనార్దన గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.