
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు పూరి అండ్ టీం. చిత్రప్రమోషన్స్లో భాగంగా లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో.. విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త లుక్‌లో చూపించి ఫ్యాన్స్‌ను ఖుషి చేశారు పూరి. కొత్త సంవత్సరం రోజున విడుదలైన లైగర్ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డ్స్ కొల్లగొడుతుంది.
రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకున్న లైగర్ గ్లింప్స్.. తాజాగా 25 మిలియన్‌కు వ్యూస్ మైలురాయిని చేరింది. 5.5 లక్షల లైక్స్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాప్‌లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాలో విజయ్ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మేకోవర్.. సరికొత్త యాటిట్యూడ్‌తో కనిపించడంతో రౌడీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో లైగర్ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నారు.
ఈ పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
ఛాయ్ వాలా టు బాక్సర్.. ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడన్నది గ్లింప్స్‌లో చూపించారు పూరి. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు