కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్..

వెంకీ సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ రామ్‌చంద్ర పక్షవాతంతో బాధపడుతున్నారు. దాదాపు 190 చిత్రాల్లో నటించిన ఆయన గత ఏడాదిగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి కోలుకుంటున్నప్పటికీ, మరిన్ని రోజులు ఫిజియోథెరపీ అవసరమని, సినీ పరిశ్రమ పెద్దలు సహాయం చేస్తే బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్..
Comedian Ramachandra

Updated on: Oct 10, 2026 | 4:51 PM

తెలుగు సినీ ప్రేక్షకులను తన హాస్యంతో అలరించిన కమెడియన్ రామ్‌చంద్ర (వెంకీ కమెడియన్) ప్రస్తుతం పక్షవాతం బారిన పడి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. వెంకీ సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చంద్ర, తన కెరీర్‌లో దాదాపు 190 చిత్రాల్లో నటించారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమై చికిత్స పొందుతున్నారు. రామ్‌చంద్ర తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ, గత సంవత్సరం మే నెలలో తాను షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ సమస్య మొదలైందని తెలిపారు. లంచ్ బ్రేక్ తర్వాత కాస్ట్యూమ్ మార్చుకుంటున్న సమయంలో ఎడమ కాలు తిమ్మిరి పట్టి, కుడి కాలు, ఎడమ చేయి మాట వినడం మానేశాయి. బీపీ తగ్గిందేమోనని మొదట భావించి, మజ్జిగ తాగి మందులు వేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ వైద్యుడిని సంప్రదించగా, ఆయన సూచన మేరకు  హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి పక్షవాతంగా నిర్ధారించారు. అధిక రక్తపోటు (బీపీ) కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు ఆయన వివరించారు. మందులు వాడినా బీపీ అదుపులోకి రాలేదన్నారు. పక్షవాతం వచ్చినప్పటి నుంచి ఆయన బెడ్ పైనే ఉన్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ, మందులు తీసుకుంటున్నారు. గత ఏడు-ఎనిమిది నెలలుగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నప్పటికీ, కాళ్లు, చేతులకు పవర్ రావాల్సి ఉందని, స్పష్టంగా మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డాక్టర్లు బాగా ఫిజియోథెరపీ చేస్తే రెండు నెలల్లో లేచి కూర్చోవచ్చని చెప్పినట్లు రామ్‌చంద్ర పేర్కొన్నారు.

సినీ పరిశ్రమ నుంచి మొదట్లో నాలుగు-ఐదు నెలల పాటు కొంత మద్దతు లభించిందని, ఆ తర్వాత అది క్రమంగా తగ్గిపోయిందని రామ్‌చంద్ర వెల్లడించారు. రవితేజ, మంచు మనోజ్ వంటి నటులు గతంలో సహాయం అందించడానికి ముందుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. మంచు మనోజ్ కూడా సపోర్ట్ ఇస్తానని చెప్పి కలిసినప్పటికీ, ఆ తర్వాత ఎటువంటి సాయం అందలేదని ఆయన వాపోయారు. చిరంజీవి, నాగార్జున వంటి సినీ పెద్దలను సంప్రదించే మార్గం తనకు తెలియడం లేదని, తన వ్యక్తిగత స్నేహితులు సహాయం చేసినా, సినీ పెద్దలు తమ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఆదుకోవాలని రామ్‌చంద్ర విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు సహాయం చేయమని ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పక్షవాతం వచ్చిందని చాలా మందికి తెలియదని, తెలిసిన వారూ చిరంజీవి గారి వరకు సమాచారాన్ని చేరవేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. గతంలో చాలా మంది తనను మోసం చేసి డబ్బు పోగొట్టుకున్నానని, అయితే ఇప్పుడు తన పరిస్థితి చూసి ఎవరూ తిరిగి సహాయం చేయడానికి రాలేదని ఆయన బాధపడ్డారు. అయినప్పటికీ, తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బు కొంతవరకు ఇప్పుడు తనను కాపాడుతోందని తెలిపారు. వెంకీ కమెడియన్ రామ్‌చంద్ర త్వరగా కోలుకోవాలని, సినీ పరిశ్రమ మద్దతుతో ఆయన మళ్లీ మామూలు మనిషి కావాలని ఆశిద్దాం.

Loading...
Unable to load recommendations.
Follow Us