Ram Charan: తండ్రిని స్క్రీన్ పై చూసి మురిసిపోతున్న క్లీంకార.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా..?

|

Jan 04, 2025 | 3:07 PM

డైరెక్టర్ శంకర్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చరణ్. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన షేర్ చేసిన క్లీంకార క్యూట్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Ram Charan: తండ్రిని స్క్రీన్ పై చూసి మురిసిపోతున్న క్లీంకార.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా..?
Ram Charan, Klin Kaara
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల చేయనున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకుగా ఈసినిమా విడుదల అవుతుండడంతో ఇటీవలే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అలాగే ముంబైలో ఈవెంట్ లో సందడి చేశారు. ఇక ఈరోజు సాయంత్రానికి మళ్లీ రాజమండ్రికి చేరుకోనున్నాడు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ ప్రచార కార్యక్రమాల్లో చరణ్ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చరణ్ సతిమణి ఉపాసన ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో క్లీంకార తన తండ్రిని మొదటిసారి స్క్రీన్ పై చూస్తూ తెగ మురిసిపోతుందట. టీవీలో తన తండ్రి కనిపించడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతుందని.. నాన్నా అంటూ చూపిస్తుందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. చాలా కాలం రోజుల తర్వాత క్లీంకార క్యూట్ వీడియో చూసి సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. గేమ్ ఛేంజర్ మూవీ కోసం తాను కూడా ఎంతో ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ఇప్పుడు క్లీంకార క్యూట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇక ఎప్పటిలాగే ఆ వీడియోలో క్లీంకార ఫేస్ చూపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన. తన తండ్రిని చూసి క్లీంకార మురిసిపోతూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఉపాసన వీడియో రికార్డ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా క్లింకార ఫేస్ కనిపించకుండా ఫోటో రివీల్ చేశారు చరణ్. ఇదిలా ఉంటే.. జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.