AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే: కాజల్ అగర్వాల్

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. అయితే చాలా మంది లాగే పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలుబాగా తగ్గించేసింది. అయితే ఇప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి సినిమాల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానంటోందీ అందాల తార.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే: కాజల్ అగర్వాల్
Kajal Aggarwal
Basha Shek
|

Updated on: Jul 07, 2026 | 7:40 AM

Share

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం: పార్ట్ 1’ ఈ దీపావళికి విడుదల కానుంది. వీటితో పాటు గోపీచంద్ మలినేని- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఎన్బీకే 111లోనూ కాజల్ కథానాయికగా చేస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన కాజల్ తల్లి అయిన తర్వాత తన సినిమా ఎంపికలు మారాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌కు నీల్ కిచ్లు అనే కుమారుడు ఉన్నాడు. తల్లి అయ్యాక తన బాధ్యత పెరిగిందన్న కాజల్ ఇలా చెప్పుకొచ్చింది.. ‘ఇప్పుడు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించే ముందైనా నా కుమారుడి కోణం నుంచి ఆలోచిస్తాను. నా సినిమాలు చూసి వాడు గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు కథలను ఎంచుకునేటప్పుడు మరింత బాధ్యత, జాగ్రత్త అవసరమవుతున్నాయి’ అని కాజల్ చెప్పుకొచ్చింది.

ఇక తన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ గురించి మాట్లాడిన కాజల్.. ‘ పురుగుమందుల మాఫియా, అవినీతి, ఆహార కల్తీ చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. మనం ప్రతిరోజూ తినే ఆహారంలో ఏముంది, దాన్ని ఎలా తయారు చేస్తారు అనే దానిపై చేసిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. దీని షూటింగ్ సమయంలో నేను షాక్ అయ్యాను. నేను గుడ్డిగా వాడే ఎన్నో వస్తువులను ఇప్పుడు నా వంటగది నుంచి పారేశాను. ఇప్పుడు నా కొడుకుకి ఏ ఆహారం పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే దానిపై నాకు స్పష్టత వచ్చింది. ఇక మా అబ్బాయికి రామాయణం అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమాలో నటిస్తున్నానని వినిచాలా సంతోషించాడు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. నేను రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపిస్తున్నాను. మా అబ్బాయికి రావణుడి పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ సినిమా రెండో భాగం వచ్చేసరికి వాడికి ఐదేళ్లు వస్తాయి. అతను థియేటర్‌లో చూసే మొదటి సినిమా ఇదే అవుతుంది,’ అని కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భర్తతో కాజల్ అగర్వాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..