Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై వివాదం.. వీడియో రిలీజ్ చేసిన నరేష్.. ఏమన్నారంటే?

'ఇడుపు కాయితం'.. గత రెండు రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఒక సినిమా టైటిల్ ను అడ్డు పెట్టుకుని కొందరు అదే పనిగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని సినిమా విశ్లేషకులు, నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.

Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం.. వీడియో రిలీజ్ చేసిన నరేష్.. ఏమన్నారంటే?
Idupu Kayitham Movie, VK Naresh

Updated on: Jun 28, 2026 | 6:10 PM

‘ఇడుపు కాయితం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా ఇదే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ సినిమా టైటిల్‌పైనే రచ్చ జరుగుతోంది. ఈ టైటిల్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఆంధ్రా వర్సెస్ తెలంగాణగా విడిపోయి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ను అడ్డు పెట్టుకుని కొందరు అదే పనిగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని సినిమా విశ్లేషకులు, నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడు ఈ ‘ఇడుపు కాగితం’ టైటిల్ వివాదంపై సీనియర్ నటుడు వీకే నరేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.

‘నేను గత రెండు రోజులుగా గమనిస్తున్నా. ఇడుపు కాయితం అనే మూవీ టైటిల్‌ను నేషనల్ సమస్యగా మార్చారు. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారని.. ఒక గొప్ప మాండలీకాన్ని అవమానపరుస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనం సిగ్గుతో తల దించుకోవాలి. తెలంగాణ, కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ., ఏ మాండలీకమైనా ఎన్నో పోరాటాలు జరిగాయి. మనం తెలుగు వాళ్లుగా ఎప్పుడూ గర్వపడాలి. కేవలం ఒక సినిమాను తీసుకుని మాట్లాడడం చాలా బ్యాడ్. సూర్య కరుప్పు టైటిల్ చూశాం. కాంతారను హిట్ చేశాం. సినిమాను సినిమాలాగే చూడండి. దయచేసి సినిమాను, భాషను కలపకండి. దీనిపై తెలుగు భాష సంఘం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాటినిపై చర్చించి వెంటనే వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనం నరుక్కుంటే ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వం, మీడియా, తెలుగు భాష సంఘం, నెటిజన్లు అందరూ కలిసి దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాం’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు నరేష్. మరి ఇంతటితోనైనా ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

వీకే నరేష్ వీడియో ఇదిగో..

ఇడుపు కాయితం సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us