Tollywood: చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి.. హోటల్‌లో పని చేసి.. కట్ చేస్తే పవన్, మహేష్‌లతో సినిమాలు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ప్రస్తుతం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దూసుకుపోతోన్న ఈ నటుడు కమ్ డైరెక్టర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి.. హోటల్‌లో పని చేసి.. కట్ చేస్తే పవన్, మహేష్‌లతో సినిమాలు
SJ Surya

Updated on: Oct 11, 2026 | 11:49 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘జైలర్ 2’. గతంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ జైలర్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన డైరెక్టర్ నెల్సన్ కుమారే రెండో పార్ట్ కు కూడా దర్శకత్వం వహించాడు. రజనీతో పాటు మొదటి భాగంలో భాగమైన శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణన్, యోగి బాబు, సునీల్, జాకీ ష్రాఫ్ తదితరులు సీక్వెల్ లోనూ యాక్ట్ చేశారు. అలాగే లో కొత్తగా ఎస్.జె. సూర్య , మిథున్ చక్రవర్తి , సూరజ్ వెంజరమూడు , విద్యా బాలన్ , అన్నా రాజన్, జతిన్ సర్నా తదితరులు జైలర్ 2 కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జైలర్ 2 సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. హీర రజనీతో సహా అందరూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు .అలాగే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్ జే సూర్య రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఇబ్బందులు, కష్టాలను అందరితో షేర్ చేసుకున్నారు.

‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. ఆ కోరికతో పదో తరగతిలోనే నన్ను వెతకకండి అని లెటర్ రాసి ఇళ్లు వదిలి పెట్టి చెన్నైకి వెళ్లిపోయాను. అప్పట్లో నేరుగా శివాజీ గణేశన్ గారి ఇంటికెళ్లి అవకాశం అడగాలని ప్రయత్నించాను. అయితే ఆయనను కలవడం కుదరకపోవడంతో మళ్లీ ఇంటికి తిరిగొచ్చాను. ఆ తర్వాత నేను చెన్నై వెళ్లిన విషయం తెలిసి అమ్మానాన్న చాలా కోప్పడ్డారు. ఇంటర్ తర్వాత మదురైలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే నేను మాత్రం చెన్నైలోనే డిగ్రీ చేస్తానని నాన్నతో చెప్పాను. నా పట్టుదలను చూసి అయిష్టంగానే అమ్మానాన్న ఒప్పుకున్నారు. అయితే సినిమాల జోలికి మాత్రం వెళ్లొద్దని కండీషన్ పెట్టారు. చెన్నైలో చదువుకుంటూనే అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. కడుపు నింపుకోవడం, ఆకలి తీర్చుకోవడం కోసం ఒక హోటల్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశాను’ అని ఎస్.జే. సూర్య చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జైలర్ 2 సినిమాలో ఎస్ జే సూర్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us