అనసూయ, రష్మీ కాదు.. ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా..?

|

Oct 18, 2024 | 4:13 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు కొంతమంది. అలాగే మరికొంతమంది చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఓ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి..

అనసూయ, రష్మీ కాదు.. ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా..?
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో ఎంతో మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు కొంతమంది. అలాగే మరికొంతమంది చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఓ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది. క్యూట్ స్మైల్, కవ్వించే కళ్లతో అంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె..  ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి ముద్దుగుమ్మలు యాంకరింగ్ నుంచి వచ్చి హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే పై ఫొటోలో ఉన్న భామ కూడా.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారి ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది పై ఫొటోలో ఉన్న భామ. ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్. తెలుగులో ఈ అమ్మడు ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెప్పించింది. కెరీర్ బిగినింగ్ లో మడోనా సెబాస్టియన్ ఓ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా చేసింది. యాంకర్ గా తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న మడోనా సెబాస్టియన్. ఆతర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. మడోన్నా 2015లో వచ్చిన మలయాళ చిత్రం “ప్రేమమ్” ద్వారా సినీరంగంలోకి వచ్చింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ప్రేమమ్ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించింది ఈ భామ. ప్రేమమ్ సినిమాను నాగ చైతన్య తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ మడోనా నటించింది. ఆతర్వాత తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.