హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

|

Dec 25, 2021 | 12:18 PM

కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులలో

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే...
Follow us on

కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులలో ఆయన ఒకరు. ఇప్పటివరకు నేరుగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన ఆ నాయకుడు ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత హీరోగా మారనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‏లో ఉండబోతున్నట్టుగా సమాచారం. ఫిబ్రవరిలో ఆయన నటించిన సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనే కదా మీ సందేహం…

అతనే టీ కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్..ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు. బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిసింది.. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలో ఉంటాయని అద్దంకి దయాకర్ వివరించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..