AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు తిరుగులేని నటి.. నేడు ఒంటరిగా,ఆకలితో.. స్టార్ హీరోయిన్ కన్నీటి గాథ

అభిమానుల జయజయధ్వానాలు, కెమెరా ఫ్లాష్‌లైట్ల వెలుగులు, రత్నాల ఉయ్యాలలు.. ఒకప్పుడు ఆమె జీవితం ఒక మహారాణి వైభవం. ప్రేమికులు ఆమె కోసం రక్తంతో లేఖలు రాసేంత అందం ఆమె సొంతం. పాకిస్థానీ వెండితెరపై 'స్టాచ్యూ ఆఫ్ మార్బుల్'గా వెలిగిపోయిన అందాల రాణి సాబిరా సుల్తానా జీవితం నేడు కనుపాప కన్నీరయ్యేలా మారింది.

ఒకప్పుడు తిరుగులేని నటి.. నేడు ఒంటరిగా,ఆకలితో.. స్టార్ హీరోయిన్ కన్నీటి గాథ
Sabira Sultana
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2026 | 6:43 PM

Share

అభిమానుల జయజయధ్వానాలు, కెమెరా ఫ్లాష్‌లైట్ల వెలుగులు, రత్నాల ఉయ్యాలలు.. ఒకప్పుడు ఆమె జీవితం ఒక మహారాణి వైభవం. ప్రేమికులు ఆమె కోసం రక్తంతో లేఖలు రాసేంత అందం ఆమె సొంతం. పాకిస్థానీ వెండితెరపై ‘స్టాచ్యూ ఆఫ్ మార్బుల్’గా వెలిగిపోయిన అందాల రాణి సాబిరా సుల్తానా జీవితం నేడు కనుపాప కన్నీరయ్యేలా మారింది. సాబిరా సుల్తానా (అసలు పేరు ‘రాబియా బేగం’) డిసెంబరు 21, 1945న బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి (నేటి ముంబై) లో ఒక కాశ్మీరీ కుటుంబంలో జన్మించారు. 1947లో భారత-పాకిస్థాన్ విభజన సమయంలో ఆమె కుటుంబం ముంబై నుండి లాహోర్‌కు వలస వెళ్లింది. భారతదేశంలో జన్మించిన మూలాలు ఉండటంతో ఆమె రూపంలో ఒక ప్రత్యేకమైన రాజసం ఉండేదని, ఆ అందమే ఆమెను వెండితెరపై తిరుగులేని తారగా నిలబెట్టింది.

సినిమా వైభవం నుండి విషాద జీవితంలోకి.. 1960ల కాలంలో పాకిస్థానీ సినిమాలో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి, తన మార్దవమైన చూపులతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారు. అయితే కాలక్రమేణా ఆమె జీవితం దారుణమైన మలుపు తిరిగింది. కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించాక ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. భర్త కూడా ఆమెను వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడంతో, తనకు అనుకునేవారు ఎవరూ లేక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోలుగత వైభవం అంతా కరిగిపోయి, నేడు ఒక చిన్న అద్దె ఇంట్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఇంట్లో అనుకోకుండా కిందపడిపోవడంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వయసు మళ్లిన భారంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక కంటినీరు పెట్టుకుంటున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా స్తోమత లేకపోవడంతో, తక్షణమే స్పందించి తనను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఒక గొప్ప నటి జీవితం చివరికి ఇలాంటి విషాదాంతానికి చేరడం సినీ ప్రియులను తీవ్రంగా కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us