Khaidi Sequel: కార్తీ సూపర్ హిట్ ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ లో ఆ స్టార్ హీరో కూడా..

|

May 13, 2022 | 4:30 PM

తమిళ్ స్టార్ హీరో కార్తీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. సినిమా చేస్తూ మెప్పిస్తున్నాడు.

Khaidi Sequel: కార్తీ సూపర్ హిట్ ఖైదీ సినిమా సీక్వెల్ లో ఆ స్టార్ హీరో కూడా..
Khaidi Movie
Follow us on

తమిళ్ స్టార్ హీరో కార్తీ(Karthi) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. సినిమా చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే కార్తీ నుంచి వచ్చిన ఖైదీ(Khaidi) సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశారు. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడు. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్ లో సింగిల్ కాస్ట్యూమ్ తో హీరోయిన్ , పాటలు లేకుండా వచ్చిన ఖైదీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

ఖైదీ సినిమా  సీక్వెల్ లో కార్తీ బ్రదర్ హీరో సూర్య కూడా నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఖైదీ’ సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య – కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు.ఖైదీ సీక్వెల్ లో ఒక పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను సూర్య తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. ఇదే విషయాన్నీ సూర్య చెప్పడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. వచ్చే నెల 3 న విడుదల కాబోతున్న విక్రమ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ జులై లోనే ఖైదీ సీక్వెల్ ను పట్టాలెక్కిస్తాడనే వార్తలు వస్తున్నాయి. 

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్