Suriya : రోలెక్స్ పాత్రపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య.. ఏమన్నాడంటే..

|

Oct 23, 2024 | 2:02 PM

కోలీవుడ్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. జనాలకు విపరీతంగా నచ్చేసిన రోలెక్స్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Suriya : రోలెక్స్ పాత్రపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య.. ఏమన్నాడంటే..
Suriya
Follow us on

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలు, కమల్ పాత్ర, ప్రతీకార కథ అన్నీ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ చివరి ఐదు నిమిషాల్లో సూర్య ప్లే చేసిన రోలెక్స్ పాత్ర హైలెట్ అయ్యింది. ఇందులో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించాడు సూర్య. ఈ పాత్ర తెరపై చివరి రెండు నిమిషాలు మాత్రమే కనిపించినప్పటికీ.. జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ క్యారెక్టర్‌ని పెట్టుకుని సెపరేట్ సినిమా చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ విషయంపై సూర్య స్పందించాడు.

సూర్య నటించిన కంగువ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సూర్యకు ఓ ఇంటర్వ్యూలో రోలెక్స్ పాత్ర గురించిన ప్రశ్న ఎదురైంది. . ‘రోలెక్స్’ భవిష్యత్తు ఎలా ఉంటుంది? రోలెక్స్‌ను మళ్లీ తెరపై చూడగలమా ? యాంకర్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూర్య. . ‘రోలెక్స్ పాత్ర కోసం అరరోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే అరరోజు కష్టపడితే అభిమానుల నుంచి ఇంత ప్రేమ, మద్దతు లభిస్తుందని ఊహించలేదు. ‘రోలెక్స్’ పాత్రను బేస్ చేసుకుని ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టాండ్ ఎలోన్ సినిమా గురించి నాతో చర్చించారు. ఈ విషయంపై రెండుసార్లు సమావేశమయ్యాం. కానీ ఏదీ ఖరారు కాలేదు’ అని అన్నారు.

ఇక ముందు ‘రోలెక్స్’ చేయాలా లేక’ఇరుంబు కై మాయావి’ చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. ‘ఇరుంబు కై మాయావి’ చిత్రం చేయి కోల్పోయిన ఓ సూపర్‌హీరో కథ. ఈ సినిమాలో సూర్య హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అయితే ఆ సినిమా కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఖైదీ 2 సినిమా గురించి కూడా చర్చ మొదలైంది, ఆ సినిమాలో రోలెక్స్, కార్తీ ఇద్దరు కలిసి నటిస్తారా అని మరోసారి అడగ్గా.. ఇప్పుడేం చెప్పలేమని..కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని అన్నారు. సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.