Sarkaru Vaari Paata : మహేష్ సినిమా మరింత వెనక్కి వెళ్లనుందా..? నిరాశలో సూపర్ స్టార్ ఫ్యాన్స్..

|

Jan 12, 2022 | 6:59 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల సంబరాలు మాములుగా ఉండవు. సినిమ రిలీజ్ అయ్యిందంటే పంగడే ఫ్యాన్స్ కు అలంటి పండగ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్

Sarkaru Vaari Paata : మహేష్ సినిమా మరింత వెనక్కి వెళ్లనుందా..? నిరాశలో సూపర్ స్టార్ ఫ్యాన్స్..
Mahesh
Follow us on

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల సంబరాలు మాములుగా ఉండవు. సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కు పండగే.. ఇప్పుడు అలాంటి పండగ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా అంచలనాలు క్రియేట్ చేశాయి. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మహేష్ మోకాలికి సర్జరీ జరగడంతో చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

మరో వైపు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడటంతో చిత్రయూనిట్ అంతా క్వారంటైన్ లోకి వెళ్ళారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఇక ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కరోనా బారిన పడటంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో సినిమా అనుకున్న సమయానికి రాక పోవచ్చు అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రతను బట్టి మహేశ్ కి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాకపోవచ్చు అని తెలుస్తుంది. దాంతో ఆగస్టు కు సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు. అప్పటికి కూడా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోతే ఇక దసరాకే సర్కారు వారి పాట వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్