
నటుడు సుభలేఖ సుధాకర్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటన, తన సినీ ప్రస్థానం , తెలుగు సినీ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులపై తన అనేక విషయాలు పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా అభివర్ణిస్తూ, అరవింద సమేత చిత్రంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. సుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ అసాధారణమైన శక్తి, కసి గల నటుడని పేర్కొన్నారు. సెట్‌లో చాలా ఆనందంగా, సరదాగా ఉండే ఎన్టీఆర్, కెమెరా ముందుకొచ్చేసరికి డైలాగ్స్ ఒకే టేక్‌లో పూర్తి చేస్తారని వివరించారు. ఎన్టీఆర్ ఎప్పుడు డైలాగులు చదువుకుంటారో కూడా తెలియదని, ఆయన పనిపట్ల ఉన్న నిబద్ధత అద్భుతమని తెలిపారు. కెమెరాలోనో, ఇతర నటుల వల్లనో తప్పు జరిగితే తప్ప, ఎన్టీఆర్ తరఫున మరో టేక్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టారేమోనని రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్పిన మాటలను కూడా సుధాకర్ గుర్తుచేసుకున్నారు.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ, సుభలేఖ సుధాకర్ ఎప్పుడూ ఒకేసారి అనేక సినిమాలు చేతుల్లో లేవని పేర్కొన్నారు. ఒక సినిమా పూర్తవగానే తదుపరి అవకాశం కోసం ఎదురుచూసేవాడినని, దేవుడి దయ వల్ల ఎప్పుడూ పని ఆగలేదని తెలిపారు. తాను చెన్నైలో నివసిస్తున్నందున కొందరు నిర్మాతలు, దర్శకులు పిలిచేందుకు వెనుకాడుతున్నప్పటికీ, తమ పాత్రకు తనే సరైనవారని భావిస్తే తప్పకుండా అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అరవింద సమేత చిత్రం కూడా అలా వచ్చిన అవకాశమేనని, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని వివరించారు. పాత్ర చిన్నదైనా, దాని ప్రభావమే ముఖ్యమని సుధాకర్ చెప్పారు. కోట శ్రీనివాసరావు ప్రతిఘటన చిత్రంలోని ఒకే సీన్ పాత్రను, మాడ ముత్యాల ముగ్గులో చిన్న పాత్రను ఉదాహరణలుగా చూపారు. ఎంత చిన్న పాత్రకైనా నటుడు తన వంద శాతం కృషిని అందిస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు.
సుభలేఖ సుధాకర్ తన అభిమాన నటుడిగా అమితాబ్ బచ్చన్‌ను పేర్కొన్నారు. తాను ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, తన వాతావరణం అలాంటిదని వివరించారు. అవార్డుల గురించి మాట్లాడుతూ, తనను ఆదరిస్తున్న నిర్మాతలు, దర్శకులు, ప్రేక్షకులు, అలాగే తనను ఇంటర్వ్యూలకు పిలిచే మీలాంటి వారే తన నిజమైన అవార్డులని వినయంగా చెప్పారు. అవార్డుల వెనుక పరుగులు పెట్టడం కంటే, నిరంతరం పని లభించడం, ఆ పనికి న్యాయం చేయడం, తద్వారా మరిన్ని అవకాశాలు రావడమే ముఖ్యమని ఆయన అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
Subhalekha Sudhakar, Jrntr
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..