SS Rajamouli: అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న

స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ దర్శక ధీరుడి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమాతో బిజీగా ఉంటోన్న జక్కన్న మరో అరుదైన గౌరవం అందుకున్నారు.

SS Rajamouli: అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
SS Rajamouli

Updated on: Jul 02, 2026 | 6:47 PM

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమకు పురిటిగడ్డగా భావించే ఫ్రాన్స్‌లోని లయోన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక ‘ఇన్‌స్టిట్యూట్ లుమియర్’ జక్కన్నను ఘనంగా సత్కరించింది. అక్కడి ప్రఖ్యాత ‘వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేక‌ర్స్’ పై రాజమౌళి పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్టించింది. తద్వారా ఈ అరుదైన గౌరవం ద్వారా మార్టిన్ స్కోర్సెస్సీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి నిలిచారు. ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ‘ఫ్రాన్స్ లోని ప్రతిష్ఠాత్మక లుమియర్ మ్యూజియంను సందర్శించాను. నా సినిమాలు ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్‌కు వెళ్ళిన సమయంలో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ నన్ను అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే ఒక సర్‌ ప్రైజ్ కూడా ఉందని చెప్పారు. నన్ను సినిమా పుట్టిన వీధిలోకి తీసుకెళ్లగా, అక్కడ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో కూడిన ఫలకాలు కనిపించాయి. ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. దానిపై నా పేరు చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు జక్కన్న.

 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాజమౌళి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జక్కన్నకు అభినందనలు చెబుతున్నారు. కాగా జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు ఇన్‌స్టిట్యూట్ లుమియర్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ప్రత్యేక ‘రెట్రోస్పెక్టివ్‌’ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్యారిస్ లో పర్యటిస్తున్నారు రాజమౌళి. ఇక ప్యారిస్‌ లోని ‘సినీమాథెక్ ఫ్రాన్సైస్’‌ థియేటర్‌లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us