SP Balasubrahmanyam: పాట అంటే బాలు.. బాలు అంటే పాట.. గాన గంధర్వుడి జయంతికి 100 మంది మ్యూజిషియన్స్‌తో కచేరి

పాట అంటే బాలు.. బాలు అంటే పాట.. పాట బ్రతికున్నంత వరకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మనమధ్యనే ఉంటారు. రకరకాల భాషల్లో 40 వేలకు పైగా ఆలపించి ఆబాలగోపాలాన్ని అలరించిన బాలు కరోనాతో ఈ లోకాన్ని విడిచిపోయిన విషయం తెలిసిందే.. 

SP Balasubrahmanyam: పాట అంటే బాలు.. బాలు అంటే పాట.. గాన గంధర్వుడి జయంతికి 100 మంది మ్యూజిషియన్స్‌తో కచేరి
Spb
Follow us

|

Updated on: Jun 02, 2022 | 9:39 PM

పాట అంటే బాలు.. బాలు అంటే పాట.. పాట బ్రతికున్నంత వరకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam)మన మధ్యనే ఉంటారు. రకరకాల భాషల్లో 40 వేలకు పైగా ఆలపించి ఆబాలగోపాలాన్ని అలరించిన బాలు కరోనాతో ఈ లోకాన్ని విడిచిపోయిన విషయం తెలిసిందే.. జూన్‌ 4వతేది బాలుగారి జయంతి (పుట్టినరోజు). ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ హైరాబాద్ లోని రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌ మాట్లాడుతూ– ‘‘ బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. జూన్‌ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకని ఉదయం 10గంటలనుండి రాత్రి 10 గంటలవరకు 12గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్‌ చేస్తున్నాం అన్నారు. పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము’’ అని అన్నారు.

ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ శ్రీరామచంద్ర మాట్లాడుతూ–‘‘ బాలుగారంటే మా జనరేషన్‌ సింగర్స్‌ అందరకీ ఇన్స్‌పిరేషన్‌. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది. జూన్‌ 4న ఆయనని మనందరం సెలబ్రేట్‌ చేసుకుందాం. ఇకనుండి నా వంతుగా మా యూనియన్‌కి ఎప్పుడూ నా సహాయసహకారాలు అందిస్తాను’’ అన్నారు. అలాగే సింగర్‌ కౌసల్య మాట్లాడుతూ–‘‘ వందమందికి పైగా సింగర్స్‌ పాల్గొని దాదాపు 12గంటలపాటు బాలుగారికి స్వర నీరాజనాన్ని అందించబోతున్నాం. మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

ఇవి కూడా చదవండి