
Sonu Sood: లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అంతేకాదు లాక్డౌన్ అనంతరం కూడా సోనూ..సహాయం చేయడం మాత్రం ఆపలేదు. సాయం కావాలంటూ.. ఎవరు అడిగిన లేదనకుండా సహాయం చేశాడు. తన సంపాదన కరిగిపోయినా కానీ.. వలస కార్మికులకు సాయాన్ని అందించాడు. దీంతో చాలా మంది సోనూసూద్‌ను రియల్ హీరోగా.. తమ ఆరాధ్య దేవుడిగా కొలిచారు. మరికొంతమంది వలస కార్మికులు తమ దుకాణాలకు ఆయన పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిని కలిసాడు రియల్ హీరో.
బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన పండగ నవీన్ ఆర్ఎంపీగా పనిచేస్తుంటారు. నవీన్, త్రివేణి దంపతులకు ఇటీవల కూతురికి జన్మించింది. ఆ చిన్నారికి సోనాలి సూద్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2న పాపకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రావాలంటూ.. సోనూసూద్‌ను ఆహ్వానిస్తూ.. ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఇక ఆ పత్రిక సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే.. రియల్ హీరో ఆ జంటను కలిశాడు. ఆ కుటుంబాన్ని కలిసి.. వారితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సోనూసూద్ చివరిసారిగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సోనూ.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.
ట్వీట్..
Also Read:
Tollywood Actresses in Sarees : నల్లటి చీరలో మెరిసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ఎంత సొగసో.. సుమీ