Sobhita Dhulipala: సమంత పై శోభితా ధూళిపాళ్ల ప్రశంసలు .. నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్..

|

Jun 24, 2023 | 4:15 PM

ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యతో శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో ఓ ఫోటో కూడా వైరలయ్యింది. అయితే ఈ రూమర్లను గతంలోనే కొట్టిపారేసింది శోభితా. తాజాగా మరోసారి సమంత, నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Sobhita Dhulipala: సమంత పై శోభితా ధూళిపాళ్ల ప్రశంసలు .. నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్..
Sobhita Dulipalla
Follow us on

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల. గూడాచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శోభితా.. ఇటీవల పొన్నియన్ సెల్వన్ చిత్రలో కీలకపాత్రలో నటించింది. ఇక ఇప్పుడు హిందీలో వరుస మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే సినిమాల గురించి మాత్రమే కాకుండా.. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యతో శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో ఓ ఫోటో కూడా వైరలయ్యింది. అయితే ఈ రూమర్లను గతంలోనే కొట్టిపారేసింది శోభితా. తాజాగా మరోసారి సమంత, నాగచైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇటీవల బాలీవుడ్ బబుల్ మీడియాతో ముచ్చటించిన శోభితా.. సమంత, చైతూ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సమంత గురించి చెప్పాలని అడగ్గా..”సామ్ ప్రయాణం చాలా కూల్ గా సాగిందని భావిస్తున్నాను. ఆమె సినిమాల సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. తన సినిమాలు బాగుంటాయి. ఆమె ఇప్పుడు ఎంత పెద్ద సినిమానైనా హ్యండిల్ చేయగలదని అనుకుంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక చైతూ గురించి స్పందిస్తూ.. “చైతన్య చాలా హుందాగా.. కూల్ గా ఉంటాడు. వేరేవాళ్లతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను అందరితోనూ మంచిగా ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే తమ గురించి వచ్చిన రూమర్స్ గురించి మళ్లీ మాట్లాడలేదు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ , శోభితా ప్రధాన పాత్రలలో నటించిన ది నైట్ మేనేజర్ పార్ట్ 2.. ఈ నెల 30న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది శోభితా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.