Sneha Ullal: దయచేసి నన్ను క్షమించండి.. స్టార్ హీరోయిన్‌కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్..

జూనియర్ ఐశ్వర్య రాయ్ గా క్రేజ్ తెచ్చుకున్న స్నేహాఉల్లాల్. 2007లో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది .

Sneha Ullal: దయచేసి నన్ను క్షమించండి.. స్టార్ హీరోయిన్‌కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్..
Sneha Ullal

Updated on: Mar 21, 2026 | 6:40 PM

చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. వారిలో స్నేహ ఉల్లాల్ ఒకరు. ఈ అందాల భామ చేసింది తక్కువ సినిమాలే అయినా అభిమానులను తన అందంతో కట్టిపడేసింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది స్నేహ ఉల్లాల్. ఈ పిల్లి కళ్ల సుందరి అందానికి కుర్రాకారు ఫిదా అయ్యారు. తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో మెల్లగా టాలీవుడ్ కు దూరం అయ్యింది ఈ చిన్నది. బాలీవుడ్ లో ఒకటిరెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు అక్కడ కూడా పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది.

బాలీవుడ్ లో ఈ బ్యూటీ కొన్ని సినిమాలతోనే సర్దేసుకుంది. బాలీవుడ్ లో ‘లక్కీ: నో టైం ఫర్‌ లవ్‌’  అనే సినిమాతో అడుగుపెట్టింది స్నేహ ఉల్లాల్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. హిందీలో కొన్ని సినిమాలు చేసిన ఈ ఆచిన్నది ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది. ఇదిలా ఉంటే తాజగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ.. తాను ఐశ్వర్యారాయ్ కు క్షమాపణలు చెప్పినట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఓ ఇంటర్వ్యూలో స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ.. నేను చూడటానికి  ఐశ్వర్య రాయ్ లా ఉంటాను అని చాలా మంది అంటుండేవారు. అలా ఐష్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే నేను ఆమెలాన్ ఉంటాను అనడంతో.. నా చిన్న ప్రపంచంలో సెలబ్రెటీ అయ్యాను. నేను మొదటిసారి ఐశ్వర్యను కలిసినప్పుడు ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. బాలీవుడ్ కు స్వాగతం అంటూ ఆహ్వానించింది. నేను పదేపదే నన్ను ఐష్‌తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను దయచేసి క్షమించండి, నన్ను ద్వేషించకండి అన్నాను.. దాన్ని ఆమె ఎలా తీసుకుందో తెలియదు అని స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us