Maha Samudram: ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. మహాసముద్రం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

టాలీవుడ్‌లో ఓవర్ నైట్ క్రేజ్ రావడం అనేది చాలా కష్టం.. కానీ ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.

Maha Samudram: ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. మహాసముద్రం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..
Mahaa Samudram

Updated on: Sep 21, 2021 | 7:29 AM

Maha Samudram: టాలీవుడ్‌లో ఓవర్ నైట్ క్రేజ్ రావడం అనేది చాలా కష్టం.. కానీ ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అజయ్ తెరకెక్కించిన ఆర్ ఎక్స్100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ.. దాన్ని అందంగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడని ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంటెన్స్‌ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ అప్డేట్ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 23న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.’మహా సముద్రం’ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ , శరణ్య కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

Raj Kundra: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us