యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చింది. దీప్తి సడెన్ షాక్‌తో.. అరే ఎంట్రా ఇది.. అని బయటికి అనలేక..! లోపల అనుకోలేక తెల్లమొఖమేసిన షణ్ను.. తాజాగా ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు తెగ ట్రైస్తున్నాడు. తన ఫేస్లో డల్‌నెస్‌ను మ్యాక్జిమమ్ తెలియనీయకుండా.. ఇంట్లో వాళ్లను నొప్పింకుండా ఉండేదుకు ప్రయత్నిస్తున్నాడు. తన పెంపుడు కుక్కతో టైమ్ స్పెండ్ చేస్తూ… దీప్తి జ్ఙాపకాల నుంచి బయట పడే ఆలోచన చేస్తున్నాడట షణ్ను. అందుకే ఎక్కువ టైం తన డార్లింగ్ కుక్కతో గడుపుతూ.. సేద తీరుతున్నాడట. అలా తాజాగా తన కుక్కను పాపరింగ్ చేస్తున్న ఓ వీడియోను తన ఫాలోవర్స్తో పంచుకున్నాడు షణ్ను. ఆ కుక్కను ముద్దాడుతూ.. ఆడిస్తూ తన ఫాలోవర్స్‌ను కాసేపు ఖుసీ చేశాడు.
అయితే షణ్ను షేర్ చేసిన ఈ వీడియోలోనూ షణ్ను డల్‌గా కనిపిస్తుండడంతో… మనోడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిగా కామెంట్లు చేస్తున్నారు. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా.. అంటూ మీమ్స్ చేస్తున్నారు. లైట్ తీసుకో.. బయటికి రా.. చిల్ బ్రో అంటూ ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :