నా వయసున్న అనుష్క, త్రిష హీరోయిన్స్‌గా చేస్తున్నారు.. నేను మాత్రంఅలాంటి పాత్రలు చేస్తున్నా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ. ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.

నా వయసున్న అనుష్క, త్రిష హీరోయిన్స్‌గా చేస్తున్నారు.. నేను మాత్రంఅలాంటి పాత్రలు చేస్తున్నా..
Heroine

Updated on: Mar 24, 2026 | 7:28 AM

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించి ఆకట్టుకున్నారు. అప్పట్లో ఆమెకు ఉండే క్రేజే వేరు.. కుర్రాళ్ళు పడిచచ్చిపోయేవారు. హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆ అందాల ముద్దుగుమ్మ. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే సీరియల్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ముదుగుమ్మ వరుసగా ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఆమె స్టార్ హీరోల గురించి చేసిన కామెంట్స్ అలాగే తన పెళ్లి గురించిన విషయాలను పంచుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఇప్పటికీ చాలా మంది అభిమాన తార.

ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రాశి. కొన్నేళ్ల క్రితం సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన అందాల భామల్లో రాశి ఒకరు. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేక్షకులను విశేషంగా మెప్పించారు రాశి. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రాశి.. ఇప్పుడు అమ్మ, అత్తా, వదిన పాత్రల్లో నటిస్తూ అలరించారు. అలాగే సీరియల్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తమిళ, తెలుగు చిత్రసీమలలోని తన విభిన్న అనుభవాలను పంచుకున్నారు.

రాశి మాట్లాడుతూ.. దాదాపు నా వయసుకున్న అనుష్క, త్రిషలాంటి వారు ఇంకా హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు.  దానికి కారణం ఏంటంటే.. నేను చిన్న వయసులోనే అంటే 14ఏళ్లకే హీరోయిన్ అయ్యా.. వాళ్లు 20, 25 ఏళ్ల వయసులో హీరోయిన్ అయ్యారు. వాళ్లకు నాకు వయసులో కాదు.. నటనలో మాత్రం దాదాపు పదేళ్ల గ్యాప్ ఉంది అని రాశి అన్నారు. హీరోయిన్ అనేది ఏజ్ ను  బట్టి అవసరం లేదు. హాలీవుడ్ లో హీరోలు హీరోయిన్స్ యంగ్ గా ఉండరు. కంటెంట్ ను బట్టే అక్కడి వాళ్లు నటిస్తుంటారు. మన సౌత్, నార్త్‌లోనే హీరోలు, హీరోయిన్స్ అందంగా ఉండాలి, వయసులో ఉండాలి, ఫిట్ గా ఉండాలి అని భావిస్తుంటారని తెలిపారు రాశి. హీరోయిన్ అంటే గ్లామర్‌గా ఉండి ఎక్స్ పోజింగ్, డాన్స్‌లు చేయడం కాదు. హీరోయిన్ అంటే యాక్టింగ్. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు యాక్ట్ చేయడమే హీరోయిన్ పని అని అన్నారు రాశి. అలాగే ఆమె మాట్లాడుతూ.. నా కూతురికి రాశి అంటే తెలియదు.. నేను విజయలక్ష్మి అని మాత్రమే తెలుసు. నా కూతురికి ఆరేళ్లు వచ్చేవరకూ కూడా నేను హీరోయిన్‌ని అని.. నా పేరు రాశి అని తెలియదు. ఆరేళ్ల తరువాత.. నేను హీరోయిన్‌ని అని స్టార్ హీరోలతో నటించానని నేను చెప్పలేదు. ఒకరోజు మా వాచ్ మెన్ వాళ్ల భార్య.. తన కూతురుకి చెప్తుంటే నా బిడ్డ వినేసింది. అప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగింది.. అమ్మా నువ్వు హీరోయిన్‌వా.? తన దగ్గర దాచాలని కాదు.. తెలిసినప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పలేదు అని రాశి చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us