Samantha: సమంత.. సౌత్‌లో టాప్ స్పీడ్‌తో దూసుకుపోతున్న నటి. ఒకప్పుడు హీరోల పక్కన నార్మల్ హీరోయిన్గా నటించిన సామ్.. ఇప్పుడు తానే క్రౌడ్ పుల్లర్‌గా మారింది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను, మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. ఒకవైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతుంది. విడాకుల అనంతరం తనదైన పంథాలో దూసుకుపోతుంది. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో బాగా యాక్టివ్ అయ్యింది సామ్. #Mymomsaid అంటూ స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతుంది. ట్రోల్ చేసేవారికి తన మార్క్ రిప్లైలు ఇస్తుంది. డివర్స్ అనంతరం సామ్ పెట్టే పోస్టులుపై నెటిజన్ల ఇంట్రస్ట్ పెరిగింది. దీంతో చాలా కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ కోసం సమంతను ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే సామ్‌కు వాణిజ్య ప్రకటన డిమాండ్ బాగా పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్‌కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతేకాదు పోస్ట్‌లకు సంబంధించి ఏమైనా ఫొటోలు, వీడియోలు షూట్ చేయాల్సి వస్తే.. వాటికి అదనంగా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. అది సమంత రేంజ్ అంటే. త్వరలోనే సామ్ గుణశేఖర్ డైరక్షన్లో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యశోద చిత్రీకరణ జరుగుతుంది.
Also Read: బాక్సాఫీస్‌పై దండయాత్ర.. రూ.500కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. తొక్కుకుంటూ పోతున్నారు