Sobhita Dhulipala: నేను అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. శోభితా పోస్ట్ పై సమంత స్టైలిష్ట్ రిప్లై..

ముఖ్యంగా హీరో నాగచైతన్యతో శోభితా ప్రేమలో ఉందంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి. చాలా కాలంగా వీరి రిలేషన్ షిప్ లో ఉన్నారని... అలాగే వెకేషన్స్ కూడా వెళ్లారంటూ ఫోటోస్ వైరలయ్యాయి. ఇక ఇటీవలే మరోసారి శోభితా, చైతూ కలిసి వెకేషన్ వెళ్లారంటూ నెట్టింట ప్రచారం నడిచింది. ఇద్దరూ కలిసే వెళ్లారంటూ కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. కానీ తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

Sobhita Dhulipala: నేను అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. శోభితా పోస్ట్ పై సమంత స్టైలిష్ట్ రిప్లై..
Sobhita Dhulipala
Follow us

|

Updated on: May 04, 2024 | 1:32 PM

తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. తెలుగమ్మాయి అయినా టాలీవుడ్ లో తక్కువే సినిమాలే చేసింది. కానీ అటు బాలీవుడ్, హాలీవుడ్ లో ఓ ఇమేజ్ క్రియేట్ చేసింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా చాటుతుంది. అయితే ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలు, సిరీస్ చేస్తూ నటిగా ఓ వెలుగు వెలుగుతుంది శోభితాకు సంబంధించి నిత్యం ఏదోక వార్త నెట్టింట వైరలవుతుంది. ముఖ్యంగా హీరో నాగచైతన్యతో శోభితా ప్రేమలో ఉందంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి. చాలా కాలంగా వీరి రిలేషన్ షిప్ లో ఉన్నారని… అలాగే వెకేషన్స్ కూడా వెళ్లారంటూ ఫోటోస్ వైరలయ్యాయి. ఇక ఇటీవలే మరోసారి శోభితా, చైతూ కలిసి వెకేషన్ వెళ్లారంటూ నెట్టింట ప్రచారం నడిచింది. ఇద్దరూ కలిసే వెళ్లారంటూ కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. కానీ తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

“ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్.. అండ్ దట్స్ ఓకే” అంటూ ఓ పోస్ట్ చేసింది. అంటే నేను అందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని అర్థం. ప్రస్తుతం శోభితా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.. ఇటీవల తమ గురించి వచ్చిన రూమర్స్ పైనే శోభితా ఇలా ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ శోభితా పోస్ట్ పై రియాక్ట్ అయ్యాడు. నేను కూడా నా విషయంలో అలాగే ఫీలవుతుంటాను అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కామెంట్ వైరలవుతుంది.

అడివి శేష్ నటించిన గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నటనపరంగా మంచి మార్కులే కొట్టేసిన శోభితాకు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. ఇటీవల రామన్ రాఘవన్ 2.0, పొన్నియన్ సెల్వన్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించింది. మేడ్ ఇన్ హెవన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇటీవలే మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles