Samantha-Sobhita Dulipala: సబ్యసాచి చీరలో అందాల ముద్దుగుమ్మలు.. మందార పువ్వుల్లా సమంత.. శోభిత ధూళిపాళ్ల..

|

Aug 18, 2023 | 5:09 PM

ఎరుపు సబ్యసాచి జార్జెట్ చీర, ఆకర్షణీయమైన హాల్టర్, నెక్ బ్లౌజ్ లో అద్భుతంగా కనిపించింది. ఈ వేడుకలో సామ్ తన లేటేస్ట్ లుక్ తో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఎర్రటి చీరలో.. కంటిరెప్పలకు మాస్కరాతో సున్నితమైన ఆకృతిగల బుగ్గలతో రోజ్ బ్లష్ తో హైలెట్ అయ్యింది సామ్. ఇక సమంత ధరించిన చెవిపోగులు, చిక్ ఫింగర్ రింగ్ తో లుక్ పూర్తిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత సామ్ ఎంతో ఎనర్జిటిక్, స్టైలీష్ లో మెరిసింది.

Samantha-Sobhita Dulipala: సబ్యసాచి చీరలో అందాల ముద్దుగుమ్మలు.. మందార పువ్వుల్లా సమంత.. శోభిత ధూళిపాళ్ల..
Samantha, Sobhita Dhulipala
Follow us on

సాధారణంగా సినీ పరిశ్రమలోని స్టార్స్ ధరించే దుస్తులు..వారి ఫ్యాషన్ లుక్ ఇష్టపడని వారుండరు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్.. ట్రెండీ అవుట్ ఫిట్ అభిమానులను కట్టిపడేస్తుంటారు. ఇక హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా.. బయట కూడా వారి ఫ్యాషన్ లుక్స్ కు ప్రత్యేకంగా ఫాలోవర్స్ ఉంటారు. ఇక కొన్ని ఫేమస్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రెటీలను ఎంచుకుంటారు. జ్యూవెల్లరీ, కాస్మోటిక్స్ మాత్రమే కాకుండా.. ఫేమస్ డిజైనర్స్ ఉత్పత్తులకు ఇండస్ట్రీలోని అందాల తారలు అంబాసిడర్స్ గా ఉంటారు. సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఇతర వేడుకలలో సెలబ్రెటీల లుక్ అందరిని ఆకర్షిస్తుంటుంది. ఇటీవల జరిగిన ఖుషి మ్యూజికల్ నైట్ వేడుకలో హీరోయిన్ సమంత ట్రెండీ చీరకట్టులో కనిపించి మెస్మరైజ్ చేశారు. టింటెడ్ షేడ్స్ ఫ్యాషన్ లుక్ లో కనిపించిన సమంత.. ఖుషి వేడుకలో ఎంతో సరదాగా కనిపించారు.

ఎరుపు సబ్యసాచి జార్జెట్ చీర, ఆకర్షణీయమైన హాల్టర్, నెక్ బ్లౌజ్ లో అద్భుతంగా కనిపించింది. ఈ వేడుకలో సామ్ తన లేటేస్ట్ లుక్ తో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఎర్రటి చీరలో.. కంటిరెప్పలకు మాస్కరాతో సున్నితమైన ఆకృతిగల బుగ్గలతో రోజ్ బ్లష్ తో హైలెట్ అయ్యింది సామ్. ఇక సమంత ధరించిన చెవిపోగులు, చిక్ ఫింగర్ రింగ్ తో లుక్ పూర్తిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత సామ్ ఎంతో ఎనర్జిటిక్, స్టైలీష్ లో మెరిసింది.

ఇవి కూడా చదవండి

సమంత సబ్యసాచి సారీ ఫోటోస్..

ఇదిలా ఉంటే.. గతంలో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల సైతం సబ్యసాచి రెడ్ సారీ రీగల్ ఇంప్రెటేషన్ ధరించారు. హాల్టర్ నెక్ బ్రౌజ్, రెడ్ సారీతోపాటు.. వైబ్రెండ్ షేడ్ తో ప్రత్యేకంగా కనిపించారు. న్యూట్రల్ ఐషాడో, బోల్డ్ కోల్ లైనర్, మాస్కరా కనురెప్పలు, ఆకట్టుకునే ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో శోభిత అందం గ్లామరస్‌గా ఉంది. డైమండ్ నెక్లెస్, సొగసైన చెవిపోగులు ఆమె రూపాన్ని మరింత అందంగా పూర్తి చేశాయి.

శోభితా ధూళిపాళ్ల ఇన్ స్టా పోస్ట్..

Sobhita Dhulipala

ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి.

సమంత ఖుషి ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి