‘RRR మరోసారి వాయిదా పడనుందా..?’.. కుండబద్దలు కొట్టేసిన రాజమౌళి.. పూర్తి క్లారిటీ

మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి.

'RRR మరోసారి వాయిదా పడనుందా..?'.. కుండబద్దలు కొట్టేసిన రాజమౌళి.. పూర్తి క్లారిటీ
Rajamouli
Follow us

|

Updated on: Dec 30, 2021 | 7:55 AM

మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. దీంతో సినిమా పరిశ్రమకు టెన్షన్ పట్టుకుంది. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగితే .. తొలిగా మూతపడేది థియేటర్సే. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉంది చిత్ర పరిశ్రమ. పలు బడా సినిమాలు.. కరోనా కష్టకాలంలో కూడా, ఓటీటీ భారీ ఆఫర్స్ ఇచ్చినప్పటికీ థియేటర్లలోనే ప్రేక్షకులను అలరించేందుకు వెయిట్ చేశాయి. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ.. మేకర్స్ నిర్ణయం మార్చుకోలేదు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఇటీవల కాలంలో రిలీజయ్యాయి. మరికొన్ని బడా మూవీస్‌ రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. అందులో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్.ఆర్.ఆర్.  RRR జనవరి 7, 2022 న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో సినిమా వాయిదా పడబోతున్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అయితే వీటిపై క్లారిటీ వచ్చింది.  RRR అనుకున్న తేదీనే రిలీజ్ అవ్వబోతుంది. దీనిపై జక్కన్న రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. రాజమౌళి  RRRను వాయిదా వేయడం లేదని, అనుకున్న సమయానికే రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా తనతో చెప్పినట్లు వివరించారు. దీంతో వాయిదా వార్తలకు బ్రేక్ పడింది.

RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. తారక్‌కు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రేయ, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు.

Also Read: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో వైఫ్ కూడా.. గుర్తుపట్టారా..?

Latest Articles