Kantara: Chapter 1: కాంతారా 2లో కీలక పాత్రలో రిషబ్ శెట్టి భార్య ప్రగతిశెట్టి..

|

Nov 28, 2023 | 2:37 PM

విడుదలైన అన్ని బాషాల్లో కాంతారా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కాంతారా సినిమాకు సీక్వెల్ రానుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంతారా సినిమాకు స్వీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ రానుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కు కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Kantara: Chapter 1: కాంతారా 2లో కీలక పాత్రలో రిషబ్ శెట్టి భార్య ప్రగతిశెట్టి..
Kantara 2
Follow us on

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన ఈ సినిమా ముందు అక్కడ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లోకి డబ్ అయ్యింది. విడుదలైన అన్ని బాషాల్లో కాంతారా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కాంతారా సినిమాకు సీక్వెల్ రానుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంతారా సినిమాకు స్వీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ రానుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కు కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. కాంతారా 2 సినిమానుంచి రిషబ్ శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు.

సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చాప్టర్ 1 క్రేజీ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విడుదలైంది. ఈ చిత్రానికి నటుడు , దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించనున్నారు. ‘కాంతారా’ సినిమాలో ప్రగతి శెట్టి చిన్న పాత్ర లో కనిపించనుంది.

నవంబర్ 27 ఆనెగుడ్డె శ్రీ వినాయక దేవాలయంలో ప్రీక్వెల్ ‘ కాంతారా ‘ లుక్ ను రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా ప్రగతిశెట్టి మీడియాతో మాట్లాడారు. గత సారి లాగానే ఈసారి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తాను. నేను ఎప్పుడూ రిషబ్ శెట్టితోనే ఉంటాను. ఈ సినిమాలో నా పాత్ర ఉందా లేదా అనేది ఇప్పటికీ నాకు తెలియదు. రిషబ్ తర్వాత ఏదైనా చెప్పొచ్చు. ప్రస్తుతం నా వైపు నుంచి కాస్ట్యూమ్ వర్క్ మాత్రమే జరుగుతోంది’ అని ప్రగతిశెట్టి అన్నారు. విజయ్ కిరగందురు ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.