Richa Gangopadhyay : తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

2010 విడుదలైన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రిచాగంగోపాద్యాయ. ఆతర్వాత మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Richa Gangopadhyay : తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Updated on: Mar 01, 2021 | 9:04 AM

Richa Gangopadhyay  : 2010 విడుదలైన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రిచాగంగోపాద్యాయ. ఆతర్వాత మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయిన మంచి పేరును సంపాదించుకుంది ఈ చిన్నది. తెలుగు, తమిళ భాషల్లో నటిగా కొన్ని చిత్రాల్లో నటించిన రిచా గంగోపాధ్యాయ కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుంది.ప్రస్తుతం సినిమాలు లేకపోయినా సోషల్‌మీడియాలో ఏదో రకంగా యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేస్తోంది.

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన రీచా  తన సహ విద్యార్ధి అయిన జోకుతో ప్రేమలో పడింది.ఆతర్వాత  ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. చాలా కాలం నుండి వార్త‌ల‌లో లేని రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు తాను గ‌ర్భ‌వ‌తిని అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది. జూన్ నెలలో మా ఫ్యామిలీలో ఓ కొత్త మెంబర్ రానున్నట్టు ప్రకటించింది. అంద‌రం చాలా సంతోషంగా ఉన్నాం అని తెలిపింది. ఈ ఫొటోలో రిచా తన గర్భాన్ని చూపిస్తుండగా..  భర్త జో రిచాను ముద్దు పెట్టుకుంటున్నాడు. ‘ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. బేబీ లాంగెల్లా ఈ జూన్ లో రాబోతున్నారు. అప్పటి వరకూ వెయిట్ చేయలేకపోతున్నాం’ అని రాసుకొచ్చింది రిచా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sandeep Koritala : తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిర్మాత మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖహీరో..

Kritishetty : ఆ యాడ్స్‌లో నటించింది చిన్నప్పటి బేబమ్మేనా..! ఆ వయసులో కెమెరా ముందు అదరగొట్టిన కృతిశెట్టి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us